- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్.కె షేర్ ఖాన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చేయి విరుగగా సోమవారం భువనగిరి మాజీ శాసన సభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు జక్క రాఘవేందర్ రెడ్డి, చందుపట్ల సింగిల్ విండో మాజీ చైర్మన్ భల్గూరి మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, నాయకులు సాబన్కార్ వెంకటేష్, పడాల వెంకటేశ్వర్లు, బోడపట్ల కృష్ణారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు చుక్క పద్మయ్య, చింతల దేవేందర్ గౌడ్ లు పాల్గొన్నారు.
- Advertisement -