Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుబాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులుబడెసాబ్, జూనియర్ అసిస్టెంట్ బాలయ్య కుటుంబాన్నీ పరామర్శించారు. గతవారం రోజులు క్రితంగుండె పోటుతో వీరిద్దరూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం రోజు స్థానిక నాయకులతో కలసి తమ నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించారు. బాలయ్య, బడేసాబ్ కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యులు మనోదైర్యంగా ఉండాలని మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా స్థానిక నాయకులు అందుబాటులో ఉండి మీ సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి, సతీష్ యాదవ్, బిజెపి మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ సింగ్, మహ్మద్,మండలనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad