నవతెలంగాణ -రాయపోల్
బడుగు బలహీన వర్గాల నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ పదవులు ఉన్న లేకున్న నిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకులు. మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతకింది మంజూరు అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ జన్మదినం వేడుకలు నిర్వహించి, రోగులకు పండ్లు పంపించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ పదవి ఉన్న లేకున్న దుబ్బాక నియోజకవర్గ ప్రజల మధ్యన ఉండే నాయకులు ఫారుఖ్ హుస్సేన్ అని ఆయన పేర్కొన్నారు.
గత 20 సంవత్సరాల నుంచి పూర్వ దొమ్మట నియోజకవర్గంలో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారన్నారు. ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని ఆయా గ్రామాల్లో నిరుపేదలకు ఫారుఖ్ హుస్సేన్ నిరుపేదలను ఆదుకోవడం కోసం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. ఫారూఖ్ హుస్సేన్ జన్మదినం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణి చేయడం జరిగిందన్నారు. ఫారూఖ్ హుస్సేన్ ఆరోగ్యవంతంగా ఉంటూ మున్ముందు మరిన్ని పదవులు చేపట్టి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా.మహారాజ్, బీఆర్ఎస్ నాయకులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ జన్మదిన వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES