- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని పలు బాధిత కుటుంబాలను మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి పరామర్శించారు. శనివారం మండలంలోని గోకుల్ తాండ బి ఆర్ ఎస్ అధ్యక్షులు బాలు నాయక్ మృతి చెందడంతో, మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పడిగల శ్రీనివాస్ సోదరుడు దత్తు మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన వెంట బి ఆర్ ఎస్ నాయకులు సంతోష్ రెడ్డి, గౌస్, హరిచంద్ర నాయక్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -