- Advertisement -
పాడే మోసిన దయాకర్ రావు
నవతెలంగాణ – పాలకుర్తి
మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి కి పితృవియోగం జరిగింది. మండలంలోని రాఘవాపురం గ్రామానికి చెందిన నల్ల రామయ్య అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రామయ్య పార్థివదహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి తోపాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. అనంతరం రామయ్య అంతిమయాత్రలో దయాకర్ రావు పాడే మోశారు. రామయ్య ఈ ప్రాంత ప్రజలకు చేసిన మేలు మరువలేనిదని దయాకర్ రావు కొనియాడారు. రామయ్య మృతి చెందడంతో పలువురు నల్ల నాగిరెడ్డిని పరామర్శించి ఓదార్చారు.
- Advertisement -