Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఆత్మహత్యకు పాల్పడ్డ మాజీ ఎంపీటీసీ..

ఆత్మహత్యకు పాల్పడ్డ మాజీ ఎంపీటీసీ..

- Advertisement -

నవతెలంగాణ – తంగళ్ళపల్లి 
తనకు రావలసిన డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని  మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య కు పాల్పడ్డ సంఘటన తంగళ్ళపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ  కరిక వేణి కుంటయ్య (48) 2019 లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.2019 నుండి 2024 వరకు లక్ష్మీపూర్,అంకుసాపూర్ గ్రామాల ప్రజలకు ఎన్నో సేవలు  అందిస్తూ తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడని స్థానికులు తెలిపారు. ఈ తరుణంలో పలు భూముల క్రయావిక్రయాల్లో  తనను ఆ వ్యక్తి మోసగించి తనకు రావలసిన డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని, తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కుంటయ్య  గ్రామ శివారులోని చెరువు వద్దకు వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందు సోమవారం అర్ధరాత్రి సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి,కిష్టారెడ్డి అనే వ్యక్తి తనను మోసగించి తనకు రావలసిన డబ్బులు ఇవ్వడం లేదని, నా చావుకు కారణం కృష్ణారెడ్డి అని లెటర్ రాసి ఊరు కు సంబంధించిన సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడని గ్రామస్తులు తెలిపారు. గ్రూప్ లో పోస్ట్ చేసిన విషయం చాలా సమయం వరకు ఎవరికీ తెలియకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున కొందరు వాట్సాప్ గ్రూప్ చూసేసరికి మాజీ ఎంపీటీసీ కుంటయ్య తను ఆత్మహత్య యత్నం చేసుకున్న విషయం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ లొకేషన్ ద్వారా ఎక్కడ ఉన్నారో తెలుసుకొని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో ఎల్లారెడ్డి పెట్ట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 
సంతాపం తెలిపిన కేటీఆర్…
మాజీ ఎంపిటిసి కరికవేని కుంటయ్య మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. పార్టీలో ఆయన చురుకుగా పని చేసి ఎన్నో సేవలు అందించాలని పేర్కొన్నారు.
పలువురు సంతాపం
అంకుశ పూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బిఆర్ఎస్ నాయకుడు మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు సంతాపం ప్రకటించారు. జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు బోల్లి రామ్మోహన్, సర్పంచుల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు మాట్ల మధు, మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు టిఆర్ఎస్ నాయకులు కుంటయ్య కుటుంబాన్ని పరామర్శించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad