Saturday, September 27, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంతొలిసారిగా ప‌బ్లిక్ మీటింగ్‌లో నేపాల్ మాజీ ప్రధాన మంత్రి ప్ర‌త్య‌క్షం

తొలిసారిగా ప‌బ్లిక్ మీటింగ్‌లో నేపాల్ మాజీ ప్రధాన మంత్రి ప్ర‌త్య‌క్షం

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేపాల్ మాజీ ప్రధాన మంత్రి, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (UML) ఛైర్మన్ కేపీ శర్మ ఓలి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా ప‌బ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. పార్టీ విద్యార్థి విభాగం, రాష్ట్రీయ యువ సంఘ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన శనివారం భక్తపూర్ చేరుకున్నారు.భారీ నిరసనల నేపథ్యంలో సెప్టెంబర్ 9న ఓలి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు. నిరసనల ప్రారంభంలో కేపీ ఓలిని నేపాల్ సైన్యం రక్షణలో ఉంచారు. తరువాత తాత్కాలిక నివాసానికి తరలించారు. తాజాగా పార్టీ సమావేశం అనంతరం కనిపించారు.

అవినీతిని అంతం చేయడం, సోషల్ మీడియా నిషేధాన్ని రద్దును తీవ్రంగా వ్య‌తిరేకిస్తూ జ‌న్ జెడ్ నిర‌స‌న‌లు మిన్నంటిన విష‌యం తెలిసిందే. నిరసనల అనంతరం ప్రస్తుతం ఆయన స్థానంలో మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కిని తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -