- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామానికి చెందిన అంగోతు మంజుల-రాజు నాయక్ దంపతుల ప్రథమ పుత్రిక వర్శిని ప్రియ-రాకెష్ వివాహం బుధవారం మంథనిలోని ఎక్లాస్ పూర్ శివసాయి గార్డెన్ లో అంగరంగవైభవంగా నిర్వహించారు. వివాహ మహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ మాజీ చైర్మన్ ఇప్ప మొండయ్య, పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. కొత్త దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు నాయక్, కాంగ్రెస్ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్, బియని రాజ మొగిలి, ఆర్టీఐ జిల్లా కోకన్వీనర్ చింతల కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
- Advertisement -



