Thursday, September 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమాజీ ప్రధాని షేక్‌ హసీనా ఓటు ర‌ద్దు

మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఓటు ర‌ద్దు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఓటు వేయకుండా ఎన్నికల కమిషన్ (ఇసి) అడ్డకుంది. ఆమె జాతీయ గుర్తింపు కార్డు(ఎన్‌ఐఎ)ను బ్లాక్‌ చేసినట్లు ఇసి బుధవారం తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సాధారణ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. షేకహేసీనా ఎన్‌ఐడిని బ్లాక్‌ చేశామని, ఎన్‌ఐడి బ్లాక్‌ చేయబడిన వారు విదేశాల నుండి ఓటు వేయలేరని ఇసి కార్యదర్శి అక్దర్‌ అహ్మద్‌ తెలిపారు. అయితే విచారణ నుండి తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోయిన వారు లేదా ఇతర కారణాల వల్ల వారి ఎన్‌ఐడి కార్డులు యాక్టివ్‌గా ఉంటే ఓటు వేయవచ్చని అన్నారు. మరే ఇతర పేర్లను ఆయన ప్రస్తావించలేదు.

హసీనా సోదరి షేక్‌ రెహానా, కుమారుడు సజీబ్‌ వాజెద్‌, కుమార్తె సైమా వాజెద్‌ల ఎన్‌ఐడిలను కూడా బ్లాక్‌ చేసినట్లు సంబంధిత ఇసి అధికారిని ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఆయన పేరును చెప్పేందుకు నిరాకరించింది. వారితో పాటు షేక్‌ రెహానా సంతానం తులిప్‌ రిజ్వానా, అజ్మినా సిద్దిఖ్‌, మేనల్లుడు రద్వాన్‌ ముజిబ్‌ సిద్దిఖ్‌, రెహానా బావ, హసీనా మాజీ భద్రతా సలహాదారు తారిఖ్‌ అహ్మద్‌ సిద్దిఖ్‌, ఆయన భార్య షాహిన్‌, వారి కుమార్తె బుష్రా సిద్దిఖ్‌ల కార్డులను కూడా బ్లాక్‌ చేసినట్లు సమాచారం. విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో 2024 ఆగస్ట్‌5న షేక్‌ హసీనా బంగ్లాదేశ్‌ నుండి పారిపోయి భారత్‌లో ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -