Tuesday, February 24, 2026
E-PAPER
Homeజాతీయంరైల్వేశాఖ మాజీ మంత్రి ముకుల్‌ రాయ్ మృతి

రైల్వేశాఖ మాజీ మంత్రి ముకుల్‌ రాయ్ మృతి

- Advertisement -

కోల్‌కతా: రైల్వేశాఖ మాజీమంత్రి, తణమూల్‌ కాంగ్రెస్‌ నాయకుడు ముకుల్‌ రాయ్ మృతి చెందారు. ఆదివారం తెల్లవారు జామున 1:30 గంటలకు కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో మరణించారు. రాయ్ మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు. అనేక అనారోగ్యాలతో బాధపడుతున్న రాయ్ కొన్ని రోజుల క్రితం కోమాలో ఉన్నారు. మృతదేహాన్ని ఆయన నివాసానికి తీసుకెళ్లి, మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గత రెండేండ్లుగా ముకుల్‌ రాయ్ ఆస్పత్రిలో, ఆయన నివాసంలో చికిత్స పొందుతున్నారు. తెలిసిన ముఖాలను కూడా ఆయన గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోయారు. ఆయన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడు. ఆయన 2017లో బీజేపీలో చేరారు. ముకుల్‌ రాజీనామా తర్వాత, తృణమూల్‌ నుంచి అనేక ఫిరాయింపులు జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -