Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్ బృందం

బీఆర్ఎస్ లో చేరిన మాజీ సర్పంచ్ బృందం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని మథురా తండా మాజీ సర్పంచ్  సంజీవ్ చౌహాన్ బృందం ఆదివారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ప్రజా ప్రతినిధులకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సంజీవ్ చౌహాన్ మాట్లాడుతూ.. పూటకు ఒక మాట చెప్పుకుంటూ మాయమాటలు చెప్పి ప్రజలకు ఎన్నికల్లో ఇచ్నిన హామీలను అమలను ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లవుతున్నా అమలు చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్ జిమ్మిక్కులకు భరించలేకనే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాలో గిరిజన గూడాలు ఎంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాండాలు జీపీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. పార్టీలో 20 మంది కార్యకర్తలు చేరామని, రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -