- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని వజ్జ పల్లి తండాలో 25 కె.వి ట్రాన్స్ఫర్ ను ఏర్పాటు చేసినందుకు సోమవారం విద్యుత్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటిదాకా 15 కెవి సబ్ స్టేషన్ ఓవర్ లోడ్ కావడం వల్ల 25 కెవి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏఈ గంగాధర్, ఏడి నరేష్, డి ఈ చక్రవర్తి, ఏఎల్ఎం తుకారాం లకు మాజీ సర్పంచ్ అనిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు సర్దార్ నాయక్, చంద్రు నాయక్ మంగ్యా నాయక్ ,ధూమా నాయక్ ,లాల్ సింగ్ ఇంక్య నాయక్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -