- Advertisement -
పదవి ముఖ్యం కాదు.. ప్రజాసేవ నా లక్ష్యం అంటున్న మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న..
నవతెలంగాణ – మునుగోడు
ప్రతి వర్షపు నీటి బొట్టును వృధాగా పోకుండా చెరువులోకి వచ్చినప్పుడే భూగర్భ జలాలు పెరిగి రైతులకు నీటి కొరత ఉండకుండా ఉంటుందని మునుగోడు మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మునుగోడు పెద్ద చెరువుకు నీరు వచ్చే వరద రాకుండా అడ్డుగా ఉన్న కల్వాట్ల వద్ద, కాల్వలలో, తాటి ముద్దులు, చెత్త, చెట్లను పరిశీలించిన మాజీ సర్పంచ్ మిర్యాల వెంకన్న, తమ సొంత ఖర్చులతో జెసిబి తో కాల్వకు అడ్డు వస్తున్న చెట్లను తొలగించి, చెరువులోకి సాఫీగా వచ్చే విధంగా చేయడంతో గ్రామ ప్రజలు, రైతులు సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -



