Tuesday, February 3, 2026
E-PAPER
Homeకరీంనగర్సిరిసిల్ల బీజేపీ మాజీ కౌన్సిలర్ రాజీనామా

సిరిసిల్ల బీజేపీ మాజీ కౌన్సిలర్ రాజీనామా

- Advertisement -

అంబేడ్కర్ విగ్రహానికి అందించిన రాజీనామా పత్రం
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మున్సిపల్ ఎన్నికల బీ ఫామ్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ నేత మాజీ కౌన్సిలర్ బోల్గాం నాగరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి రాజీనామా పత్రాన్ని అందించారు. సిట్టింగ్ కౌన్సిలర్ అయిన తాను బీ ఫామ్ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపీని రెండు సార్లు కలిసిన కూడా బీ ఫామ్ ఇవ్వలేదని మండిపడ్డారు.

పట్టణ బీజేపీ నేతలు అమ్ముడు పోయారని ఆరోపించారు.బీజేపీ నేతలు డబ్బులకు బీ ఫామ్ అమ్ముకున్నారని మాజీ కౌన్సిలర్ బోల్గాం నాగరాజు ఆరోపించారు.  తనకు బీ ఫామ్ ఇవ్వొద్దని వివిధ పార్టీల నేతలు ఫోన్ చేశారని జిల్లా అధ్యక్షుడు గోపి తెలపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉన్నప్పటికీ ఓటుబ్యాంక్ లేని వ్యక్తికి బీఫామ్ ఇచ్చారని మండిపడ్డారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -