- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణకొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సతీమణి, మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కియోన్ హీని అరెస్టు చేశారు. స్టాక్ మార్కెట్‌లో అవకతవకలు, మోసాలకు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. సియోల్‌లో 4 గంటల పాటు మాజీ ఫస్ట్ లేడీ కిమ్‌ను విచారించారు. తాను ఏ తప్పు చేయలేదని ఆమె పేర్కొన్నారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మంగళవారం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
- Advertisement -