నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నీరడి సాయన్న (55) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో చికిత్స పొందుతున్న సాయన్న ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. తెలంగాణ ప్రభుత్వం తర్వాత సాయన్న టీడీపీ నుండి బీజేపీ లోకి చేరారు.పార్టీలో క్రమశిక్షణ, కార్యకర్తల మధ్య ఐక్యత, గ్రామస్థాయిలో నడిచే సమస్యల పరిష్కారంలో ముందుండే నేతగా సాయన్న ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.గత కొన్ని నెలలుగా కిడ్నీల సమస్య తీవ్రరూపం దాల్చడంతో తరచూ వైద్యం పొందుతున్నప్పటికీ ఆరోగ్యం కుదురుకోక చివరకు మృతి చెందారు.సాయన్న మరణంతో టిడిపి శ్రేణుల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. మండలంలో పార్టీకి ఆయన సేవలు అపూర్వమని స్థానిక నాయకులు కొనియాడారు. బషీరాబాద్ లోని ఆయన ఇంటి వద్దకు చేరుకొని పలువురు నివాళులర్పించారు.
టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు నీరడి సాయన్న మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



