Wednesday, January 28, 2026
E-PAPER
Homeఖమ్మంటిడబ్ల్యూజేఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి పల్లా కొండలరావుకి పితృవియోగం 

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా మాజీ కార్యదర్శి పల్లా కొండలరావుకి పితృవియోగం 

- Advertisement -

– అనారోగ్యంతో ప్రకృతి ప్రియుడు రామకోటయ్య మృతి 
– తన ఇంటిని పార్కుగా మార్చిన వన ప్రియుడు 
– మండలంలో మొట్టమొదటగా రైస్, నూనె మిల్లులు ఏర్పాటు 
– రైస్ మిల్లును తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రామకోటయ్య
– పోతినేని, నున్నా, పొన్నం, దొండపాటి నివాళులు 
నవతెలంగాణ – బోనకల్ : ఖమ్మం జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షుడు, కార్యదర్శి బోనకల్ మండల పరిధిలోని చొప్పకట్లపాలెం ఉపసర్పంచ్ పల్లా కొండలరావు తండ్రి పల్లా రామకోటయ్య (93) అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి కుమారుడు పల్లా కొండలరావు ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. రామకోటయ్య అత్యంత ప్రకృతి ప్రియుడు. బోనకల్ మండల పరిధిలో మొట్టమొదటగా చొప్పకట్లపాలెంలో నూనె మిల్లు ప్రారంభించాడు. అదేవిధంగా రైస్ మిల్లు కూడా మొట్టమొదటిగా బోనకల్ మడలంలో రామకోటయ్యే ప్రారంభించాడు. ఆనాడు విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఆయిల్ ఇంజన్ ద్వారా రైస్ మిల్లు ని నూనె మిల్లు ని నడిపించాడు. బోనకల్లు మండలం నుంచి అనేక గ్రామాలు రైస్ మిల్లు కోసం చొప్పకట్లపాలెం రావాల్సిందే. రైస్ మిల్లులో ఎటువంటి దగాదా గాని అక్రమము గాని లేకుండా రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆడించి లెక్క ప్రకారం సంబంధిత వ్యక్తికి బియ్యం అందించేవారు. రైస్ మిల్లు అనగానే మండల వ్యాప్తంగా మొట్టమొదటిగా గుర్తుకు వచ్చే వ్యక్తి పల్లా రామకోటయ్య. విద్యుత్తు లేని సమయంలో కూడా ఆయిల్ ఇంజన్ ద్వారా రైస్ మిల్లు నడిపించిన ఏకైక వ్యక్తి రామకోటయ్య మాత్రమే. రైస్ మిల్లును తన ప్రాణం కంటే మిన్నగా భావించారు. రైస్ మిల్లు పై అంత అమితమైన ప్రేమను కనపరిచి ఆదర్శ జీవిగా తన జీవితాంతం జీవించారు. నేటికీ తాను స్థాపించిన రైస్ మిల్లును తన కుటుంబమే నిర్వహించటం విశేషం. రామకోటయ్య పట్ల గ్రామస్తులందరికి అపారమైన ప్రేమ అభిమానం నేటికు చెక్కుచెదరలేదంటే ఆనాటి నుంచి నేటి వరకు రామకోటయ్య గ్రామాభివృద్ధికి ప్రజలకు అందిస్తున్న సేవలే కారణమని గ్రామస్తులు అంటున్నారు. వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత తన ఇంటి ఆవరణలో కూరగాయలు పండ్ల తోటలో చెట్లు పెంచటం ఆయన జీవితంలో ప్రధాన భాగంగ మారింది. భోజనం చేసే సమయం, రాత్రి నిద్రపోయే సమయంలో తప్ప ఎప్పుడూ ఆ ప్రకృతి వనంలోనే రామకోటయ్య కాలం గడుపుతాడు. తన ఇంటి ఆవరణని అందమైన పార్కుగా మార్చారు. సాయంత్రం వరకు ఆ పార్కులోనే ఏదో ఒక పని చేస్తూ కాలం గడిపాడు.93 సంవత్సరాలు వయసులో కూడా రామకోటయ్యకు బీపీ షుగర్ లేకపోవడం విశేషం. మంగళవారం రోజు అంతా తన పల్లె ప్రకృతి వనంలోనే పారా, గడ్డపార పట్టుకొని పనిచేశారు. మంగళవారం రాత్రి ఒక్కసారిగా శ్వాస ఆడక మృతి చెందాడు. రామకోటయ్య మృతి చెందటంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి నివాళులు అర్పించారు.
పోతినేని, నున్నా, పొన్నం, దొండపాటి నివాళులు
రామకోటయ్య  మృతదేహాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు, మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్ రావు డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు పాపినేని రామ నరసయ్య, మండల కార్యదర్శి కిలారు సురేష్ సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 
నవతెలంగాణ మేనేజర్ జావీద్ నివాళులు
నవతెలంగాణ రీజియన్ మేనేజర్ సయ్యద్ జావిద్, నవతెలంగాణ రికవరీ, సర్కులేషన్ జిల్లా ఇన్చార్జి ఇరుగు వెంకటేశ్వర్లు, ఖమ్మం – 2 డివిజన్ ఏడిబిటి ఇన్చార్జి చేబ్రోలు నారాయణ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు నివాళులు
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దువ్వ సాగర్, జిల్లా కోశాధికారి తేనె వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పల్లా కొండలరావుని పరామర్శించి సంతాప సానుభూతి తెలిపారు. 

బోనకల్ ప్రెస్ క్లబ్ (అక్రిడిటేషన్) అధ్యక్షుడు సురభి వెంకన్న కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు సభ్యులు రేగళ్ల శ్రీనివాసరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి, కొండలరావుని పరామర్శించి సంతాప సానుభూతి తెలిపారు. 

బోనకల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డేగల వేలాద్రి నాయకులు షేక్ బడే సాహెబ్, షేక్ బాజీ షరీఫ్, మంద సత్యానందం, మాగి ముఖేష్, కొనతాలపల్లి నాగేశ్వరరావు, నాగంటి రాజశేఖర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. 
చొప్పకట్లపాలెం సర్పంచ్ కాటేపల్లి అశ్విని, సీపీఐ(ఎం) చొప్పకట్లపాలెం గ్రామ కమిటీ కన్వీనర్ చలమల అజయ్ కుమార్ శాఖా కార్యదర్శులు బోయినపల్లి పున్నయ్య, బండి శ్రీనివాసరావు, మాజీ శాఖా కార్యదర్శులు చలమల హరి కిషన్ రావు, బొప్పాల అజయ్ కుమార్, నాయకులు ఉన్నం వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ బూసి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు కందికొండ శ్రీనివాసరావు, దొప్ప కొరివి వీరభద్రం, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ హసన్, ముష్టికుంట్ల మాజీ సర్పంచ్ కొమ్ము శంకర్రావు, మాజీ శాఖా కార్యదర్శి షేక్ నజీర్, మాజీ ఎంపీటీసీ చెల్ది ప్రసాద్, చిరునోముల సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు నిమ్మ తోట ఖాన, చొప్పకట్లపాలెం మాజీ సర్పంచులు కొనకంచి నాగరాజు, ఎర్రంశెట్టి సుబ్బారావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు పుల్లారావు టిడిపి నాయకులు తన్నీరు రవి తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పల్లా కొండలరావుని, కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాప సానుభూతి తెలిపారు. పల్లా కొండలరావు కుమారుడు రామకోటయ్య ముద్దుల మనవడు  అరవింద్ తన తాతయ్య మృతదేహం వద్ద సుమారు గంటకు పైగా నిలబడి కన్నీరు మున్నీరుగా విలపించడంతో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కన్నీరు పెట్టారు. తన తాతయ్య మృతి ని అరవింద్ తట్టుకోలేకపోయాడు.
పల్లెప్రపంచం ఫౌండేషన్ సంతాపం
పల్లెప్రపంచం ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులుగా పనిచేసిన పల్లా రామకోటయ్య కు ప్రస్తుత కమిటీ నివాళులు అర్పించారు. అధ్యక్ష, కార్యదర్శులు పల్లా కొండలరావు, బోయినపల్లి అంజయ్య, సభ్యులు కొండేటి అప్పారావు, ప్రవీణ్, రచ్చా మధు, మార్కపుడి బ్రహ్మం, బోయినపల్లి సురేష్ లు నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -