నవతెలంగాణ- రాజన్న సిరిసిల్ల
సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బండారి శ్యాం బీఆర్ఎస్ పార్టీకీ రాజీనామా చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పదవ వార్డుకు బిఆర్ఎస్ టికెట్ ఆశించిన నాకు పార్టీలోని దడిదల శ్రావణ్ రావుతో పాటు మరి కొంతమంది కలిసి టికెట్ ఇవ్వకుండా చేశారని ఆయన ఆరోపించారు. 17 ఏళ్ల పాటు బి.ఆర్.ఎస్ పార్టీ కోసం ఎల్లప్పుడూ నమ్మకంగా పని చేశానని, నమ్మక ద్రోహం చేశారంటూ శ్యాం ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆలోచించి కార్యకర్తలు నాలాంటి నాయకులు పార్టీలో నుంచి బయటకు వెళ్లకుండా ఉండాలంటే బిఆర్ఎస్ పార్టీలో నమ్మకద్రోహం చేస్తున్న కొంతమంది నాయక ముఠాను పక్కకు పెట్టాలని అన్నారు. లేనట్లయితే పార్టీ మనుగడ కష్టమని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాజీనామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



