Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపూర్వ వీఆర్‌ఏ, వీఆర్‌ఓలకు జీపీఓలుగా అవకాశం కల్పించాలి

పూర్వ వీఆర్‌ఏ, వీఆర్‌ఓలకు జీపీఓలుగా అవకాశం కల్పించాలి

- Advertisement -

– ప్రభుత్వానికి తెలంగాణ రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రెవెన్యూ శాఖలో పని చేసి, అపార అనుభవం కలిగిన పూర్వ వీఆర్‌ఏ, వీఆర్‌ఓలకు అర్హతలతో సంబంధం లేకుండా గ్రామ పాలనాధి కారులుగా(జీపీఓ) అవకాశం కల్పించాలని తెలంగాణ రెవెన్యూ సర్వీస్‌ అసోసియేషన్‌(టీజీఆర్‌ఎస్‌ఏ) కోరింది. సంఘం గౌరవ అధ్యక్షులు వి.లచ్చిరెడ్డి సమక్షంలో రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం రెవెన్యూ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. రెవెన్యూ విభాగంలో నేరుగా నియామకమై 2018-19లలో వీఆర్‌ఓలుగా సుమారు 250 మంది పదోన్నతి పొందారని తెలిపారు. ప్రస్తుతం వివిధ విభాగాల్లో పని చేస్తున్న వీరు, మళ్లీ రెవెన్యూ శాఖలో సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. అయితే జీపీఓల నియామకానికి సంబంధించిన జీవోలో పేర్కొన్న కొన్ని నిబంధనలు అడ్డుగా ఉన్నాయని తెలిపారు. పదేండ్ల సర్వీసు నిబంధన వీరికి తీవ్ర ఆటంకంగా మారిందని గుర్తు చేశారు. ఈ నిబంధనను మార్చి వారికి అవకాశం కల్పించాలని కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad