కొలనుపాకలో బీఆర్ఎస్ కుటుంబానికి మరో విజయం
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన బొంకూరి కుటుంబం మరోసారి ప్రజల విశ్వాసాన్ని చాటుకుంది. గతంలో బొంకూరి భాగ్యలక్ష్మి ఎంపీటీసీగా సేవలందించగా, తాజాగా ఆమె భర్త బొంకూరి మల్లేశం 4వ వార్డు మెంబర్‌గా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వార్డు మెంబర్ బొంకూరి మల్లేశం మాట్లాడుతూ.. గతంలో ఎంపీటీసీగా గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేశామని గుర్తు చేశారు. తమ వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని మల్లేశం తెలిపారు.
నాడు భార్య ఎంపీటీసీ.. నేడు భర్త వార్డు మెంబర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



