Friday, May 16, 2025
Homeజాతీయంబస్ కండక్టర్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడి

బస్ కండక్టర్ పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాడి

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా రెచ్చిపోయారు. తన అనుచ‌రుల‌తో క‌లిసి ఓ ప్రయివేట్‌ బ‌స్సు కండ‌క్ట‌ర్‌పై దాడికి పాల్ప‌డ్డారు. గురువారం మదనపల్లె పట్టణంలోని బెంగళూరు బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే… మద‌న‌ప‌ల్లె మండ‌లం దొన‌బైలుకు చెందిన హ‌రినాథ్ కొన్నేళ్లుగా మ‌ధుసూద‌న అనే ప్రయివేట్ ట్రావెల్ బ‌స్సు కండ‌క్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఆయ‌న బ‌స్సు బెంగ‌ళూరు నుంచి బ‌య‌లుదేరి మ‌ద‌న‌ప‌ల్లెకు వ‌చ్చే క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే న‌వాజ్‌బాషాకు చెందిన బ‌స్సును ప‌లుమార్లు మ‌ధ్య‌లో ఓవ‌ర్‌టేక్ చేసుకొని వ‌స్తోంది. గ‌తంలోనూ ప‌లుమార్లు ఈ రెండు బ‌స్సుల స‌మ‌యాల‌పై ఇరువురి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయి. గురువారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌లకు మ‌ధుసూద‌న మ‌ద‌న‌ప‌ల్లెలోని బెంగ‌ళూరు బ‌స్టాండ్‌కు చేరుకోగా ప్ర‌యాణికులు ఎక్కుతున్నారు. దీంతో ఆగ్ర‌హించిన మాజీ ఎమ్మెల్యే 20 మందికి పైగా త‌న అనుచ‌రుల‌తో క‌లిసి కండ‌క్ట‌ర్ హ‌రినాథ్‌పై దాడికి పాల్ప‌డ్డారు. త‌న బ‌స్సు కంటే ముందుగా ఎందుకు వ‌స్తున్నారంటూ కొట్టిన‌ట్లు బాధితుడు తెలిపాడు. దాడిలో గాయపడిన హరినాథ్ స్థానిక ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని టుటౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కండ‌క్ట‌ర్ ఫిర్యాదు మేర‌కు ఘ‌టనాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్యే న‌వాజ్ బాషాతో మాట్లాడారు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న అనుచ‌రుల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు సీఐ చంద్ర వెల్ల‌డించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -