- Advertisement -
నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని గంగమ్మ గుడి నిన్నటి భారీ వరదలకు గంగమ్మ గుడి కొట్టుకపోయింది. అమ్మవారి విగ్రహాలు కొద్ది దూరంలో వెలిశాయి. దీని గమనించిన గంగపుత్ర సంఘం సభ్యులు అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసి పూజలు నిర్వహించారు విషయం తెలుసుకున్న గాంధారి మాజీ జెడ్పిటిసి సభ్యుడు తానాజీ రావు గంగమ్మ వెలసిన స్థలాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి రూ. 51000 విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం మండల అధ్యక్షుడు బెస్త నవీన్. సభ్యులు నారాయణ, మధు, సంగయ్య, ఆగమయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -