పట్టు సాధించిన వడ్డేపల్లి శ్రీనివాసులు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాల్టీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బరిలో నిలిచిన 9మంది అభ్యర్థులలో ఏడుగురు గెలవడం గమనార్హం. బీఆర్‌ఎస్ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి మరొకరు గెలుపొందారు. మున్సిపల్ ఎన్నికల్లో తన కుమారుడికి బీఆర్‌ఎస్ నుంచి అవకాశం కల్పించాలని ఆ పార్టీ అధిష్టానాన్ని వడ్డేపల్లి శ్రీనివాసులు కోరారు. అభ్యర్థనను బీఆర్‌ఎస్ తిరస్కరించడంతో కల్వకుంట్ల కవితను సంప్రదించి ఎఐఎఫ్‌బీ నుంచి బరిలో దిగారు.
ఇక్కడి నుంచి 10మంది పోటీపడగా ఏడుగురు ఫార్వర్డ్ అభ్యర్థులు గెలుపొందారు. వడ్డేపల్లి మున్సిపాల్టీ నుంచి గెలిచిన వారిలో ఫార్వర్డ్ బ్లాక్ ఒకటో వార్డు నుంచి పావణి, సరంద, వెంకట్రామన్ కాంగ్రెస్, మంజుల ఫార్వర్డ్ బ్లాక్, అజయ్ కుమార్‌రెడ్డి ఫార్వర్డ్‌బ్లాక్, దేవమ్మ, విజయభాస్కర్, నందిజయశ్రీ ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందిన వారు కాగా సూరి బీఆర్‌ఎస్, తిమ్మప్ప ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చెందిన వారు.
పార్టీలు ఆదరించకుంటే
ఎవరికైనా రాజకీయ పార్టీలకు పోటీ చేయడానికి భీ ఫామ్ ఇవ్వకపోతే సింహం గుర్తు నుంచి పోటీ చేయడం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తేమీ కాదు. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గతంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ మున్సిపాల్టీలో 10 మంది ఏఐఎఫ్‌బీ అభ్యర్థులు పోటీ చేశారు. అప్పటి నుండే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు జూపల్లి దూరమయ్యారు. దీంతో ఆయన ఏఐఎఫ్‌బీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించడంతో డీకే అరుణ సమాజ్‌వాది పార్టీ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.
వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



