Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం నాగార్జున సాగర్  నియోజకవర్గం పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామంలో శుక్రవారం శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి  గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో  గ్రామపంచాయతీ ఉద్యోగులు, గ్రామ ప్రజలు మరియు మండల నాయకులతో కలిసి”నూతన గ్రామపంచాయతీ భవనాన్ని శంకుస్థాపన చేశారు. అలాగే పెద్దగూడెం గ్రామం లో క్యాటిల్ షెడ్ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలు ఎంఎల్ ఏ జయవీర్ చేతుల మీదుగా లబ్ధిదారులు అందజేశారు.

దాంతో పాటు వందరోజులు పూర్తిచేసిన ఉత్తమ ఉపాధి కూలీలకు ఎం పీ డబ్యూ కి సన్మానం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవీ,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్నాటి  లింగారెడ్డి,  హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీఓ సుధీర్ కుమార్,కార్యదర్శి విజయ్ కుమార్,నియోజకవర్గం కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు చామల సువర్ణ,మండలం అధ్యక్షులు పబ్బు యాదగిరి గౌడ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుందర్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -