నవతెలంగాణ – బల్మూరు
మండల కేంద్రం బల్మూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మండల పరిధిలోని వీరంరాజు పల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభం శంకుస్థాపన చేశారు. బల్మూరు మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ..మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. మహిళా సంఘాల సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీరంరాజు పల్లి లో నిర్మించే నూతన గ్రామపంచాయతీ భవనాన్ని నాణ్యతగా నిర్మించి సకాలంలో పనులు పూర్తి చేసి ఇవ్వాలని కాంట్రాక్టర్లకు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, గిరివర్ధన్ గౌడ్, రాంప్రసాద్ గౌడ్, కాశన్న యాదవ్, మోహన్ రెడ్డి, ఖదీర్, ఎల్లికంటి శ్రీనివాస్, మషన్న, సంపంగి రమేష్, రవీందర్, కృష్ణ నాయక్, సైదులు, ప్రశాంత్, శ్రీను మహేశ్,కుర్మయ్య, నరసింహ, వ్యవసాయ అధికారులు నరేష్, పవన్, సమాఖ్య సభ్యులు మంగమ్మ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం – జీపి నిర్మాణానికి శంకుస్థాపన: ఎమ్మెల్యే వంశీకృష్ణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



