- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
బాసరలో బుధవారం రోజు పలు అభివృద్ధి పనులకు జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. బాసరలో 5.75 కోట్లతో నిర్మించనున్న 30పడకల ఆస్పత్రి నిర్మాణానికి, ట్రిపుల్ ఐటి లో 1.50 కోట్లు లతో చేయనున్న పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి నగేష్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్సీ దండె విఠల్, సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, మాజీ మంత్రులు వేణుగోపాల్ చారి, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు నారాయణ రావు పటేల్, విఠల్ రేడ్డి, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, ట్రిపుల్ ఐటీ విసి గోవర్థన్, ఆయా శాఖల అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.
- Advertisement -