Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడిపల్లి స్టేజి వద్ద విగ్రహాలకు శంకుస్థాపన

మేడిపల్లి స్టేజి వద్ద విగ్రహాలకు శంకుస్థాపన

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల పరిధిలోని రాజీవ్ రహదారి మేడిపల్లి స్టేజి వద్ద కమాన్ పైన విగ్రహాల నిర్మించేందుకు ఏదుల్ల విజయ భాస్కర్ రెడ్డి,నీలిమ దంపతులు విగ్రహాల నిర్మాణానికి దాతగా నిలిచారు. సోమవారం మేడిపల్లి సర్పంచ్ బొడిగె సదానందం గౌడ్ ఆధ్వర్యంలో విగ్రహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి లొ తను సైతం భాగస్వామ్యం అవుతున్నామన్నారు.

ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేవుడు తనకు ఇచ్చిన దాంట్లో నుండి గ్రామానికి తన వంతు సహకారంగా సేవ చేయడం ఎంతో అదృష్టంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు వార్డు సభ్యులు పాకాల వెంకటరెడ్డి, ముత్యం రెడ్డి, మందల రాఘవరెడ్డి, పాకాల రాజిరెడ్డి, పాకాల ప్రభాకర్ రెడ్డి, పాపిరెడ్డి, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -