Wednesday, July 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి..

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి..

- Advertisement -

ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలి..
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టం చేయాలి
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొలం రాజేందర్.
నవతెలంగాణ – మల్హర్ రావు
: కార్మిక వ్యతిరేక నాలుగు కొడ్లను కేంద్రం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భూపాలపల్లి జిల్లా కార్యదర్శి పొలం రాజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం సార్వత్రిక సమ్మెలో భాగంగా కాటారం చేపట్టిన సమ్మెలో మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తున్నది తప్ప కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను నష్టం చేసే  నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని విమర్శించారు.

కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు లేబర్ కోడ్ ల ద్వారా కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేశారని విమర్శించారు. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తుందని తెలియజేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన నుండి కార్పొరేట్ లకు 16 లక్షల 35 వేల కోట్లు మాఫీ చేశారని విమర్శించారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని రైతు పండించిన పంటకు కేంద్రం గిట్టుబాటు ధర చట్టం చేయాలని ఉపాధి హామీ పనుల్లో కార్మికులకు కనీసం రోజు కూలి రూ.600 రూపాయలను నిర్ణయించాలని ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచాలని అన్నారు.

ఆశ వర్కర్లకు ఫిక్స్ వేతనం నిర్ణయించాలని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ప్రత్యేక గ్రాండ్ ద్వారా వేతనాలు ఇవ్వాలని ఐకెపి వివోఎ సమస్యలు పరిష్కరించి  కనీస వేతనం ప్రతి కార్మికులకు రూ.26,000 ఇవ్వాలని మధ్యాహ్నం భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించి వారికి కనీస వేతనం అమలు చేయాలని సంగటి తరంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నారు   భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వెల్ఫేర్ కార్డులను వెంటనే విడుదల చేయాలని పెండింగ్ లో ఉన్న క్లైమ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రతి కార్మికునికి ప్రమాద బీమా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కార్మికులు ఐక్య పోరాటలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్,కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు  ఆత్కూరి శ్రీధర్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ కుమార్, రైతు సంఘం నాయకులు గుమ్మడి తిరుపతిరాజ శ్వరి, జయప్రద, పద్మ, రజిత, స్వరూప, పారువతి, శైలజ, శారద, లక్ష్మి లతోపాటు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -