ఆదిలాబాద్‌లో ఒక్కరోజే మూడు రోడ్డు ప్రమాదాలు
నవతెలంగాణ – బంజారాహిల్స్/ఇంద్రవెల్లి/షాబాద్
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న సయ్యద్ హుస్సేన్ (40) ఖాళీ సమయంలో ర్యాపిడో డ్రైవర్‌గా ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై విజయనగర్ కాలనీకి చెందిన అక్షిత (20)ను ఎక్కించుకుని పంజాగుట్ట వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో వెంగళరావు పార్కు వద్దకు రాగానే వెనకాల నుంచి వస్తున్న వాటర్ ట్యాంకర్ వేగంగా వచ్చి బైక్‌ను ఢ కొట్టింది. దాంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ సహాయంతో వారిని సమీపంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా.. ఒకరికి గాయాల య్యాయి. ఇన్స్‌స్పెక్టర్ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని హైతాబాద్ గ్రామానికి చెందిన దాసరి అజరు (19), ఉదయకిరణ్ (19), ఆజాన్ దినసారి కూలీలు. ఆదివారం సాయంత్రం ముగ్గరు కలిసి చేవెళ్లకు వెళ్లారు. రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా నాగర్‌గూడ చౌరస్తా వద్ద కంటెనర్ లారీ ఢకొీట్టడంతో అజరు, ఉదరుకిరణ్ అక్కడిక్కడే మృతిచెందారు. ఆజాన్ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వారి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. అజాన్‌ను నగరంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. ఉదరుకిరణ్ తండ్రి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ బ్రిడ్జి వద్ద బోల్తా పడింది. కాగా, ఎవరికి ప్రాణాపాయం లేదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా బొలెరో వాహనం ఒకే సారి బ్రిడ్జిపైకి వచ్చాయి. దాంతో బొలెరోను తప్పించబోయి బస్సు బ్రిడ్జి నుంచి వాగులో పడింది. బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలు కాగా వారిని ఉట్నూర్ ప్రభుతాస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఉట్నూర్ ఎస్‌ఐ విజరు కుమార్ తెలిపారు. వాగులో పడ్డ బస్సును క్రేన్ సహాయంతో బయటికి తీశారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. కాగా, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్డబొజ్జు పటేల్ ఉట్నూర్ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని క్షతగ్రాతులను పరామర్శించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మెరుగైన వైద్యం అవసరమున్న వారిని రిమ్స్ తరలించాలని ఆదేశించారు. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాల సహాయం అందిస్తుందని ధైర్యం చెప్పారు. మరో ఘటనలో.. ఉట్నూర్ బస్టాండ్ వద్ద మధ్యాహ్నం హోటల్ వద్ద కూర్చున్న ఇద్దరు వ్యక్తులకు ఎక్స్ రోడ్డు నుంచి జన్నారం వైపు వెళ్తున్న కారు ఢకొీంది. దాంతో ఇద్దరు ఒక మహిళతో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఉట్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్థానిక సెయింట్ పాల్ పాఠశాల వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కాగా, ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



