Wednesday, October 15, 2025
E-PAPER
Homeక్రైమ్Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని నలుగురు మృతి

Road Accident:ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని నలుగురు మృతి

- Advertisement -

వ్యాక్సిన్ కోసం వస్తూ రోడ్డు ప్రమాదం..
తండ్రి, కూతురు, ఇద్దరు చిన్నారులు మృతి
నవతెలంగాణ – భిక్కనూర్
రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ స్కూటీని ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరొకరు మరణించిన ఘోర ప్రమాద ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి షాప్దీపూర్ కాలనీకి చెందిన కిషన్ (53) ఇంటికి తన కూతురు జస్లిన్ (29), మనుమలు జోయల్ ప్రకాష్ (4), జోయల్ జడ్సన్ (5 నెలల‌ బాబు) గత కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చారు. చిన్నారులకు షాప్దీపూర్ సమీపంలో ఉన్న ఆస్పత్రులలో నెలసరి వ్యాక్సిన్ వేయాలని వెళ్లగా వ్యాక్సిన్ బుక్ లేని కారణంగా వ్యాక్సిన్ వేయలేదు.

భిక్కనూరు పట్టణ కేంద్రంలోని బంధువుల సహకారంతో వ్యాక్సిన్ కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ద్విచక్ర వాహనంపై తండ్రి, కూతురు, మనుమలు వస్తున్నారు. జంగంపల్లి గ్రామ శివారులోకి చేరుకోగానే రాంగ్ రూట్లో ఎదురుగా వస్తున్న టిప్పర్ ఒక్కసారిగా ఢీకొనగా తండ్రి,కూతురు, బాబు అక్కడికక్కడే మరణించగా మరో 5 నెలల బాబు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి శవాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి టిప్పర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -