Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
– మార్బుల్స్‌ హమాలీ వలస కార్మికులతో సమావేశం
నవతెలంగాణ – హస్తినాపురం

కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 20న జరిగే సమ్మెలో వలస కార్మకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ కోరారు. రంగారెడ్డి జిల్లా హస్తినాపురం డివిజన్‌ పరిధిలోని సాగర్‌ రింగ్‌ రోడ్‌ చౌరస్తాలో మార్బుల్స్‌ హమాలీ వలస కార్మికులతో బుధవారం సీఐటీయూ ఎల్బీనగర్‌ సర్కిల్‌ కన్వీనర్‌ ఆలేటి ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు లేబర్‌ కోడ్‌లతో కార్మికులు బానిసలుగా మారే అవకాశం ఉందన్నారు. గత చట్టాల్లో వలస కార్మికులకు రక్షణ చట్టం ఉందని, వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఉందన్నారు. కానీ నేడు వలస కార్మికులకు సంక్షేమ పథకాలు అందక చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారు చేసిన కష్టం ఇంటి అద్దెలకే సరిపోవడం లేదని, కాబట్టి వలస కార్మికులందరికీ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నేటి పాలకులు అనుసరిస్తున్న విధానాలతో మూడు శాతం ఉన్న ప్రజల వద్ద 70 శాతం సంపద పోగైందని, పైగా వారికే ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నదని తెలిపారు. ఆ మూడు శాతం ప్రజలపై అదనపు పన్నులు వేసి పేదలకు రాయితీలు అంద జేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్మికులం దరికీ ఉచిత విద్యా, వైద్యం సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఏదుల గోవిందు, బాలయ్య, లాలూ నాయక్‌, దుర్గారావు, అజరు కృష్ణ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad