Tuesday, November 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..

నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..

- Advertisement -

ఐఎన్టియుసి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ
నవతెలంగాణ – అచ్చంపేట
కార్మికులకు ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ అన్నారు. మంగళవారం ఆయన నవతెలంగాణతో మహబూబ్ అలీ మాట్లాడుతూ.. కార్పొరేట్లకు ఊడిగం చేసేలా ఉన్న లేబర్ కోడ్ లను నేషనల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంజీవరెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు. ఈ కోడ్ లు అమల్లోకి వస్తే కార్పొరేట్ సంస్థలకు కార్మికుల శ్రమశక్తిని చౌకగా అందించడం అవుతుందన్నారు.

సమ్మె హక్కు తో పాటు అనేక ప్రయోజనాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి యావత్ కార్మికులను దెబ్బతీసే విధంగా గతంలో ఎనిమిది గంటలు పనిచేసే వాళ్లు ఇప్పుడు 12 గంటలు పనిచేయవలసి వస్తుందన్నారు. రోజు రోజుకి బిజెపి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఈ దేశంలో రాజ్యాంగం ఉండకూడదు,  బిజెపి పార్టీ వాళ్లు రాసిన రాజ్యాంగమే నడవాలి అనే విధంగా కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. ఈ నాలుగు లేబర్ కోడ్లు వెనక్కి తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే విధంగా ధర్నాలు రాస్తారోకోలు చేపడతామని ఐఎన్టీయూసీ హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. నేడు 26 తారీకు నాడు దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఐఎన్టియుసి నాయకులు చందు నాయక్, గౌస్ పాషా, మౌలానా, రామచంద్రయ్య,  రాములు, రఘు రాజు వెంకటేష్, శ్రీరాం నాయక్ మహేష్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -