Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంనలుగురు మావోయిస్టులు మృతి

నలుగురు మావోయిస్టులు మృతి

- Advertisement -

మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ బోర్డర్‌లో ఎన్‌కౌంటర్‌
వీరిలో ముగ్గురు మహిళలు

రాయ్‌పూర్‌ : మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో అటవీ ప్రాంతం తుపాకుల శబ్దాలతో దద్దరిల్లింది. బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టు లు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా పోలీసులకు అందింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు, సీఆర్పీఎఫ్‌కు చెందిన రెండు క్విక్‌ యాక్షన్‌ టీమ్‌లు (క్యూఏటీలు) గడ్చిరోలి-నారాయణ్‌పూర్‌ సరిహద్దుల్లో గల కోపార్శి అటవీ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ను చేపట్టాయి. అదనపు ఎస్పీ ఎం.రమేశ్‌ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్‌ జరిగింది. భారీ వర్షంలోనూ జరిగిన ఈ ఆపరేషన్‌లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దాదాపు ఎనిమిది గంటల పాటు సాగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం వద్ద పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దేశంలో మావోయిస్టుల అంతమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన ఆపరేషన్‌ కగార్‌లో భాగంగానే ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు ధ్రువీకరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad