కైరో : ఉత్తర గాజా స్ట్రిప్‌లో ఆదివారం ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో నలుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. గాజా నగరంలోని దర్రజ్ శివారులో జాఫా స్ట్రీట్ వద్ద ఉన్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. అయితే తాము హమాస్‌కు చెందిన సభ్యులనే హతమార్చామని ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది. కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి ఇజ్రాయిల్ దానిని ఉల్లంఘిస్తూ సుమారు 700 మందిని బలితీసుకుంది. కాగా తమ ముందు ఉంచిన నిరాయుధీకరణ ప్రతిపాదనపై స్పందన తెలియజేసేందుకు హమాస్ బృందం గత వారం ఈజిప్ట్, టర్కీ, ఖతార్ మధ్యవర్తులతో చర్చలు జరిపింది. గాజా నుంచి పూర్తిగా వైదొలుగుతానని ఇజ్రాయిల్ హామీ ఇచ్చే వరకూ ఆయుధాలను విడనాడే విషయంపై చర్చించబోమని మధ్యవర్తులకు హమాస్ తేల్చి చెప్పింది.
ఇజ్రాయిల్ వైమానిక దాడిలో నలుగురు పాలస్తీనియన్ల మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



