నవతెలంగాణ-మల్హర్ రావు
ప్రభుత్వ నిషేధిత గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను అరెస్ట్ చేసినట్లుగా కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్, ఎస్ఐ-2 రాజన్ కుమార్ తెలిపారు. కాటారం డిఎస్పీ సూర్యనారాయణ, సిఐ నాగార్జున రావు ఆదేశాల మేరకు గురువారం తాడిచెర్లలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా మారుతి సిప్ట్ డిజైర్ కారుపై అనుమానంతో తనిఖీ చేయగా అందులో బిల్ల బన్నీ,కోట లక్ష్మన స్వామి,విజయగిరి హరీష్,తొట్ల గణేష్ నలుగురు యువకులు గంజాయిని తరలిస్తూ దొరికినట్లుగా తెలిపారు. నిందితులు ఓడిశాలోని మారుమూల ప్రాతం నుంచి కిలో గంజాయిని రూ.3,500 తీసుకొచ్చి 100 గ్రాముల ప్యాకేట్స్ తయారు చేసి రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్లుగా తెలిపారు. ఈ నిందితుల వద్ద రూ.65 వేల విలువైన మొత్తం1.290 గ్రాముల గంజాయ్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు.ప్రభుత్వ నిషేధిత గంజాయ్,మత్తు పదార్దాలకు అలవాటు పడి యువత జీవితం నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.
గంజాయ్ తరలిస్తున్న నలుగురు యువకులు అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



