Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నవంబర్ 8న రామన్నపేటలో నాల్గవ జిల్లా మహాసభలు

నవంబర్ 8న రామన్నపేటలో నాల్గవ జిల్లా మహాసభలు

- Advertisement -

జిల్లా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ
నవతెలంగాణ – భువనగిరి

ఈనెల 8న రామన్నపేటలో నిర్వహించే సిఐటియు భవన నిర్మాణ నాలుగో మహాసభలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక జగదేకపూర్ చౌరస్తాలో మహాసభల కరపత్రం విడుదల చేసి మాట్లాడారు. రామన్నపేట మండల కేంద్రంలో మల్లికార్జున ఫంక్షన్ హాల్ లో ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇట్టి మహాసభలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మూలంగా శ్రామిక వర్గం కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, జిల్లావ్యాప్తంగా 400 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 

1970 సంవత్సరంలో సిఐటియు ఆవిర్భవించి నాటీ నుండి నేటి వరకు అనునిత్యం సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం నిర్వహించడంలో దేశంలోనే అగ్ర గ్రామి కార్మిక సంఘంగా సిఐటియు పనిచేస్తుందన్నారు. కార్మికులకు నష్టం చేసే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ కార్మికులను ఐక్యం చేస్తూ రైతు వ్యతిరేక చట్టాలపై జరిగిన పోరాటంలో రైతులకు అండగా నిలబడిందన్నారు. సిఐటియు నేటికీ అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి కార్మికుల హక్కులను సాధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణం కార్మిక సంఘం అధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శులుగా ఉడుత సోములు, తుర్కపల్లి, నరసింహ, లక్ష్మీనారాయణ, ఎల్లమ్మ, అమర్, చుక్కమ్మ  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -