![]() |
మండల స్థాయిలో ఈ నెల 18 నిర్వహణ…
ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట : తెలంగాణా క్రీడా ప్రాధికార సంస్థ – తెలంగాణా స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట లో ప్రవేశాల కై జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో స్థాయిలో ఈ నెల 16 సోమవారం నుండి 19 లోపు ఎంపికలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖాధికారి ప్రసాదరావు ఆదివారం తెలిపారు. మండల స్థాయి ఎంపికలకు వెళ్ళే బాల బాలికలు మొదటగా tgss.telangana.gov.in వెబ్ సైట్ లో రిజిస్టేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని తెలిపారు.
అప్లికేషను ఆన్లైన్ లో చేయుటకు కావలసి అర్హతలు : 01- 09 – 2016 నుడి 31- 08 – 2017 పుట్టిన వారై ఉండాలి. ఆధార్ కార్డు నెంబర్,ఫోన్ నెంబర్,జనన ధృవీకరణ పత్రం,పాస్ పోర్ట్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన అభ్యర్ధులు ఈ నెల 18 వ తేదీన అశ్వారావుపేట లోని గుడ్ న్యూస్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించే ఎంపికలు కు హాజరు కావాలని ఆయన తెలిపారు.