- మధ్యాహ్నం 1.45ని.లకు
నవతెలంగాణ హైదరాబాద్: ఐదు టీ20ల సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్న దశలో నేడు జరిగే నాలుగో మ్యాచ్ ప్రాధాన్యత సంతరించుకుంది. సిరీస్‌ను చేజిక్కించుకోవాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో ఆసీస్, మూడో టీ20లో టీమిండియా విజయం సాధించాయి. ముఖ్యంగా మూడో 20లో టీమిండియా గెలుపులో పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. తన అద్భుత స్పెల్‌తో 35పరుగులకే 3కీలక వికెటు పడగొట్టి ఆసీస్‌ను కట్టడి చేశాడు. దీంతో ఆ జట్టు 187 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచినా.. మన బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే సునాయాసంగా ఛేదించారు.
లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సుందర్(49నాటౌట్; 23బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు), జితేశ్ శర్మ(22నాటౌట్; 13బంతుల్లో 3ఫోర్లు) ధనా ధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(25; 16బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) రాణించినా.. శుభ్‌మన్(15) నిరాశపరిచాడు. దీంతో టి20 సిరీస్ చేజిక్కించుకోవాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఏ జట్టు గెలిచినా.. సిరీస్ ఆశలు సజీవంగా నిలుపుకోనున్నాయి.
జట్లు(అంచనా)…
ఇండియా: సూర్యకుమార్(కెప్టెన్), శుభ్‌మన్/జైస్వాల్, సంజు(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, దూబే/ఆర్ష్‌దీప్, అక్షర్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరణ్ చక్రవర్తి, బుమ్రా.
ఆస్ట్రేలియా: మాఛెల్ మార్ష్(కెప్టెన్), ఇంగ్లిస్(వికెట్ కీపర్), హెడ్, టిమ్ డేవిడ్, ఓవెన్, స్టొయినీస్, బార్ట్‌లెట్, ఎల్లిస్, కుహ్నేమన్, షార్ట్, హేజిల్‌వుడ్.
అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వేగంగా వైరల్ అయింది. రాత్రి వేళ ఘాట్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన గుర్తుచేస్తోంది. శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల సంచారం సాధారణమే అయినప్పటికీ, ఇంత పెద్ద కొండచిలువ రోడ్డుపై కనిపించడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



