ఎక్స్ కార్యాలయాల్లో సోదాలు
పారిస్ : చిన్నారుల అశ్లీల దృశ్యాలు, డీఫ్‌ఫేక్‌లను వ్యాప్తి చేయడం వంటి ఆరోపణలపై ఫ్రాన్స్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశంలోని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ కార్యాయాల్లో మంగళవారం సోదాలు నిర్వహిం చింది. అలాగే, విచారణ కోసం ఎక్స్ యజమాని, ప్రపంచ ధనవం తుడు ఎలన్ మస్క్‌కు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 20న విచార ణకు షెడ్యూల్ చేసింది. ఈ వివరాలను ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడిం చింది. మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో చిన్నారుల అశ్లీల చిత్రాలను పోస్టు చేయడం, వాటిని వ్యాప్తి చేయడంలో సహకరించడం, లైంగికంగా అసభ్యకరమైన డీప్‌ఫేక్‌లు.. వంటి ఇతర నేరాలపై ప్రాసిక్యూటర్ల సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు నిర్వహిస్తుందని ఫ్రాన్స్ ప్రభుత్వం పేర్కొంది. ఎక్స్ ఉద్యోగులను కూడా విచారించడానికి సమన్లు జారీ చేసినట్లు తెలిపింది. కాగా, అయితే, ఈ సోదాలు, సమన్లుపై ఎక్స్ ఇంకా స్పందించలేదు.
ఎలన్‌మస్క్‌కు ఫ్రాన్స్ సమన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



