– నలుగురి అరెస్ట్ ొ టూ టౌన్ సీఐ వివరాలు వెల్లడి
నవతెలంగాణ -మిర్యాలగూడ
చిట్టీల పేరిట మోసం చేసిన నలుగురిని అరెస్టు చేసినట్టు మిర్యాలగూడ టూ టౌన్ సీఐ సోమనరసయ్య తెలిపారు. మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన సైదిరెడ్డి, కటికం వెంకటరెడ్డి, ముద్దిరెడ్డికొండకు చెందిన మామిళ్ల వెంకన్న, రామ్‌నగర్‌కు చెందిన గుణగంటి జానయ్య కొంతకాలంగా చిట్టీలు నడుతుపుతున్నారు. పలువురు నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. వడ్డీ అధికంగా ఇస్తామని ఆశ చూపి 42 మంది నుంచి సుమారు 1.50 కోట్లు వసూలు చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద 46 చిట్టీల పుస్తకాలు, 50 ప్రాంసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పర్చనున్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు రాంబాబు, హరీష్ రెడ్డి ఉన్నారు.
చిట్టీల పేరిట మోసం
- Advertisement -
- Advertisement -