- Advertisement -
- జిల్లా తనికలు, కొలతల అధికారి కె వెంకటేశ్వర్లు..
- నవతెలంగాణ – రామన్నపేట
వ్యాపారులు తునికలు, కొలతలలో వినియోగదారులను మోసానికి గురిచేస్తే ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని జిల్లా తునికల, కొలతల అధికారి కె వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని శ్రీ సాయి శ్రీనివాస, హరిహర పుత్ర రైస్ మిల్లులు, సిరిపురం, సర్నేనిగూడెం, వెల్లంకి, రామన్నపేట ఐకెపి, పిఎసిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని కాంటాలను, వేయింగ్ మిషన్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ధ్రువీకరించని బాట్లను, తరాజులను, తూకం యంత్రాలను ఎట్టి పరిస్థితులలో వినియోగించరాదని ఆయన సూచించారు.
వినియోగదారులు వేమరపాటగా ఉంటే మోసపోయే అవకాశం ఉందని, కొలతలు తూకాలు వేసే సందర్భంలో సిగ్గుపడకుండా, చూసి చూడనట్లుగా వ్యవహరించవద్దని ఆయన తెలిపారు. ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు తూకంలో అనుమానం ఉంటే వేరే కాంటపైన తూకం వేసుకొని సరిచూసుకోవాలని, తేడాలుంటే నిగ్గదీసి అడగాలని, వెంటనే సంబంధిత తూనికలు, కొలతల అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. మేమెప్పుడూ అందుబాటులోనే ఉంటామని ఆయన తెలిపారు. ఆయన వెంట పిఎసిఎస్, ఐకీపీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
- Advertisement -



