- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల శ్రీవారి దర్శనం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పేరుతో నకిలీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రికమండేషన్ లెటర్లు తయారుచేసి అమాయక భక్తుల నుంచి డబ్బులు దోచుకుంటున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. నాయుడుపేటకు చెందిన ప్రవీణ్ కుమార్, బాలాజీ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
- Advertisement -



