Thursday, May 1, 2025
Homeజాతీయంశ్రామికులందరికీ ఉచిత ప్రమాద బీమా: పవన్

శ్రామికులందరికీ ఉచిత ప్రమాద బీమా: పవన్

నవతెలంగాఱ – అమరావతి : కార్మికులకు ఏపీ డిప్యూటీ సీఎం శుభవార్త చెప్పారు. దేశ నిర్మాణంలో శ్రామికుల పాత్ర అత్యంత కీలకమని, వారు లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని ఆయన అన్నారు. కార్మిక దినోత్సవం (మేడే) పురస్కరించుకుని నేడు ఆయన శ్రామికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. శ్రామికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.ఇకపై కార్మికులను ‘కూలీలు’ అని కాకుండా ‘ఉపాధి శ్రామికులు’ అని గౌరవంగా సంబోధించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పని ప్రదేశంలో ప్రమాదవశాత్తూ మరణించిన ఉపాధి శ్రామికుడి కుటుంబానికి అందించే పరిహారాన్ని రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా, ఉపాధి శ్రామికులందరికీ రూ. 3 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img