Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొరిపల్లిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం 

కొరిపల్లిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవంగర: మండలంలోని కొరిపల్లి గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. వడ్డెకొత్తపల్లి పల్లె దావఖాన వైద్యాధికారి రాజ్ కుమార్, ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ రవికుమార్ లు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది బూబ, కిషన్, శ్రీను, పుష్ప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -