ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి :

మండల కేంద్రం శివారులోని పాటీ హనుమాన్ ఆలయం వద్ద శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లికి  చెందిన స్వర్గీయ బెజ్జారపు గంగామణి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు కొనసాగిన ఈ శిబిరంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బెజ్జారపు రాము రోగులకు ఆయుర్వేద వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా ఆయుర్వేద మందులను అందజేశారు. ఈ సందర్భంగా శిబిరంలో పాల్గొన్న వారి కోసం పాటి హనుమాన్ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లికి చెందిన సాయి శ్రీనివాస హాస్పిటల్ చైర్మన్ బెజ్జారపు శ్రీనివాస్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బెజ్జారపు మురళి, కుటుంబ సభ్యులు, పాటి హనుమాన్ దేవాలయ  కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love