Friday, July 11, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి..

ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి..

- Advertisement -

– బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ 
నవతెలంగాణ – కామారెడ్డి
: ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలకు ఉచిత బస్  సౌకర్యం కల్పించాలని కోరుతూ గురువారం బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏవో కు వినతి పత్రాన్ని అందజేశారు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ  రాష్ట్ర కన్వీనర్ డాక్టర్, విశారదన్ మహారాజ్  ఆదేశాల మేరకు కామరెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏవో  కు   బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ  ఆధ్వర్యంలో   ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు ఏర్పాటు చేయాలని కోరుతూ ఏవో ద్వారా కలెక్టర్ కు తెలియజేయడం జరిగిందనీ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ సభ్యులు నీల నాగరాజు(ముదిరాజ్ )  జిల్ల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్  అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 26,000 పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయనీ, దానిలో 22 లక్షల పైన బడుగు బలహీనవర్గాల పేద విద్యార్థులు పాఠశాలలో చదువుచున్నారు, వారికి ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలని , కామారెడ్డి జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ  ఆద్వర్యంలో , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సభ్యులు  బోలేశ్వర్,రాజు, గంగరాజు , రాజశేఖర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -