Monday, March 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా

ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు రూ.10వేల కోట్లు ఆదా

- Advertisement -

ఇది కేవలం ప్రయాణం కాదు…
తెలంగాణ ఆడబిడ్డల గెలుపు : ఆర్టీసీ ఎమ్‌డీ వై.నాగిరెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలు రూ.10వేల కోట్లు ఆదా చేసుకున్నారని ఆర్టీసీ ఎమ్‌డీ వై నాగిరెడ్డి తెలిపారు. 2023 డిసెంబర్‌ 9న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఆదివారానికి (29.03.2026) రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 290 కోట్ల ఉచిత టికెట్ల మీద ప్రయాణించి మహిళలు లబ్దిపొందారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రవాణా ఛార్జీల కోసం నెలకు సగటున రూ.1,500 నుంచి రూ.2,500 వరకు వెచ్చించే సామాన్య, మధ్యతరగతి మహిళలు, విద్యార్థినులు, కూలీలు ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకుంటున్నారని తెలిపారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. మహాలక్ష్మి అమలు తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందనీ, పథకం రాకముందు 40శాతంగా ఉన్న మహిళల వాటా, ప్రస్తుతం 67 శాతానికి పైగా నమోదవుతోందని తెలిపారు. ప్రతిరోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నట్టు వెల్లడించారు. ఉచిత ప్రయాణాలతో రూ.10వేల కోట్లు ఆదా చేసుకున్న మహిళా ప్రయాణికుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -