- Advertisement -
నవతెలంగాణ – (వేల్పూర్ ) ఆర్మూర్
మండలంలోని పడగల గ్రామంలో ఆర్మూర్ స్నేహ లేజర్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది కంటి పరీక్షలు నిర్వహించినారు. ఈ సందర్భంగా డాక్టర్ స్నేహ మాట్లాడుతూ.. ఉదయం నుండి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి మందులు, అద్దాలు ఉచితంగా అందజేసినట్టు తెలిపారు. తలనొప్పి, మెడ నొప్పి, దూరం చూపు, దగ్గర చూపు ఇబ్బందులు, కుట్టు లేకుండా కంటి శాస్త్ర చికిత్సలు ,కాంటాక్ట్ లెన్స్ సౌకర్యంతో పాటు డయాబెటిక్ ,అధిక రక్తపోటు బిపి పేషెంట్స్ కి రెటీనా పరీక్షలు సైతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



