Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 

పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు 

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండలంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను అందించనున్నట్లు పశు వైద్యాధికారి డాక్టర్ విట్టల్ తెలిపారు. ఈనెల 15 నుంచి నవంబర్ 14 వరకు మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పశు సంపద కలిగిన రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 15, 16న, మండల కేంద్రమైన రెంజల్ లో, 17న, అంబేద్కర్ నగర్,18, 23న కళ్యాపూర్, 24న దండిగుట్ట, 25న, పేపర్ మిల్,27, 28న, నీలా,29, 30న బోర్గం,31, నవంబర్ 1న, దూపల్లి, నవంబర్ 3, 4న, తాడు బిలోలి, మౌలాలి తాండ, 6న, సాటాపూర్, 7, 8న, కూనేపల్లి, కిసాన్ తండా,10, 11న, కందకుర్తి,12, 13న, వీరన్న గుట్ట, వీరన్న గుట్ట తండా, 14న, బాగేపల్లి గ్రామాలలో ఇట్టి టీకాలను వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -