Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు కమ్మర్ పల్లిలో ఉచిత పిల్లల హెల్త్ క్యాంపు

రేపు కమ్మర్ పల్లిలో ఉచిత పిల్లల హెల్త్ క్యాంపు

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి  : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన సిరి పిల్లల హాస్పిటల్ వారి అధ్వర్యంలో ఉచిత పిల్లల హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి శనివారం తెలిపారు.హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో పని చేసిన అపార అనుభవం కలిగిన, కమ్మర్‌పల్లి వాస్తవ్యుడైన డాక్టర్ చిలుక చైతన్య హెల్త్ క్యాంపులో చిన్న పిల్లలకు ఉచితంగా వైద్యం అందిస్తారని తెలిపారు.ఈ క్యాంపులో అప్పుడే పుట్టిన పాప నుండి 15సంవత్సరాల లోపు పిల్లలకు చూడడం జరుగుతుందని పేర్కొన్నారు.ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు ఉచిత పిల్లల హెల్త్ క్యాంపు కొనసాగుతుందని తెలిపారు.అదేవిధంగా అవసరమైన పిల్లలకు మందులు కూడా ఉచితంగా అందజేస్తారని వివరించారు. కమ్మర్‌పల్లి, పరిసర గ్రామాల ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామస్వామి కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -